నిజామాబాద్ జిల్లా, వర్ని మండల పరిధిలోని జాకోర గ్రామపంచాయతీ సర్పంచ్ గా పోటీలో ఉన్న శనిగరం కిషన్ అదృశ్యమైనట్లు గ్రామంలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతోంది.
గ్రామాభివృద్ధికి తన యొక్క సహాయ సహకారాలు అందిస్తానని బరిలో ఉన్న శనిగరం కిషన్ అనివార్య కారణాల చేత విత్ డ్రా చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు.
విత్ డ్రా చేసుకున్నప్పటి నుండి గ్రామంలో శనిగరం కిషన్ కనబడడం లేదని గ్రామంలో వాల్ పోస్టర్లు పెట్టారు. ఈ విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
