HomeCRIMEసీపీ హెచ్చరికలు బేఖాతరు......హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ లో విద్యార్థి నేతల వీరంగం.......ఉద్యోగుల మీద దాడులు...

సీపీ హెచ్చరికలు బేఖాతరు……హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ లో విద్యార్థి నేతల వీరంగం…….ఉద్యోగుల మీద దాడులు …..పోలీసులను ఆశ్రయించిన మేనేజ్ మెంట్ ……కఠిన చర్యలకు సీపీ ఆదేశాలు..

ప్రైవేట్ విద్యాసంస్థల లోకి చొరబడి అరాచకాలకు పాల్పడే విద్యార్ధి సంఘాల ఫై కఠిన చర్యలు వుంటాయని సీపీ స్వయంగా హెచ్చరించారు వరుస ఉదంతాలు నేపథ్యంలో సీపీ కఠిన కార్యచరణ కు ఆదేశించారు కానీ ఆయన ఆదేశాలను విద్యార్థి సంఘాలు లైట్ గా తీసుకున్నాయి.

ఇలాంటి హెచ్చరిక లు షరా మాములే అనుకున్నారు అందుకే బొర్గం లోని ఓ ప్రైవేట్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ కి రెండు రోజుల క్రితం చొరబడ్డారు. మీ కాలేజీ పాలనా లొసుగులున్నాయి లొల్లి చేయమంటారా సెటిల్ మెంట్ చేసుకుంటారా అంటూ బేరం మొదలు పెట్టారు లేదంటే కాలేజ్ నడవదు అంటూ దబాయించారు.

కాలేజీ ఓనర్ లేక పోవడంతో అక్కడి సిబ్బంది గట్టిగా మాట్లాడారు మేము స్టూడెంట్ లీడర్లం మాతో ఇష్టం వచ్చి మాట్లాడుతారా అంటూ వీరంగం సృష్టించారు. మూకుమ్మడిగా సిబ్బంది మీద విరుచుక పడ్డారు ఫర్నిచర్ ధ్వంసం చేసారు సిబ్బంది బీతిల్లి పోయారు పరుగులు తీశారు.

గాయపడ్డ సిబ్బంది లో ఒకరి చేయి విరిగి పోయింది కాలేజీ యాజమాన్యం నేరుగా నాలుగో టౌన్ లో పిర్యాదు చేసింది ఎహే మేము ఏదో అడగడానికి వెళ్తే దురుసుగా మాట్లాడారు …కొట్టారు అంటూ స్టూడెంట్ లీడర్లు సైతం పిర్యాదు చెయ్యడం కొస మేరుపు అయితే విషయం తెలిసిన సీపీ సాయి చైతన్య నేరుగా రంగంలోకి దిగారు కఠిన చర్యలు ఉండలని అందులోనూ పోలీసు మార్క్ ట్రీట్ మెంట్ కోసం ఆదేశాలు జారీచేశారు ఒకప్పుడు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించిన విద్యార్థి సంఘాలు..

ఇప్పుడు అదే ఉద్యమాలను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యల సాధన పేరుతో విద్యాసంస్థల్లోకి చొరబడి యాజమాన్యాలపై ఒత్తిడి తేవడం, తరగతులకు అంతరాయం కల్పించడం, బంద్‌లతో విద్యార్థుల చదువును దెబ్బతీయడం, డబ్బులు ఇవ్వకపోతే విధ్వంసాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఈపాటికే వెల్లు వెత్తుతున్నాయి .

ఉద్యమాల అసలు లక్ష్యం పక్కదారి పట్టి, కొందరు నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యార్థి సంఘాలను వేదికగా మార్చుకున్నారనే ఆరోపణలు విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు, విద్యాసంస్థల భద్రత, విద్యా వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన ఈ ఆరోపణలకు నిదర్శనంగా నిలుస్తోంది.విద్యార్థుల హక్కుల సాధన, కళాశాల బంద్ పేరుతో కళాశాలల్లోకి బలవంతంగా ప్రవేశించడం, యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావడం, డబ్బులు డిమాండ్ చేయడం, నిరాకరిస్తే విధ్వంసాలకు పాల్పడడం వంటి ఘటనలు విద్యాసంస్థల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

విద్యా వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే భయాందోళనలు సృష్టిస్తుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విద్యాసంస్థల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కళాశాలల్లోకి బలవంతంగా ప్రవేశించడం, యాజమాన్యాలను బెదిరించడం, ఫర్నిచర్ లేదా ఇతర ఆస్తులను ధ్వంసం చేయడం, విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే కమిషనర్ హెచ్చరికలు వెలువడిన కొద్ది రోజులకే నగరంలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌కు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు ఆందోళన పేరుతో కళాశాలలోకి బలవంతంగా ప్రవేశించి యాజమాన్యంపై దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కళాశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా రూ.1 లక్ష ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారని, అందుకు నిరాకరించడంతో ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు సిబ్బందికి గాయాలైనట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఘటన సమయంలో కళాశాల విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని తెలుస్తోంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఫోర్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై తీవ్రంగా స్పందించిన కమిషనర్, ఆరోపణలపై కేసు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

ఈ ఘటనతో విద్యార్థి సంఘాల పేరుతో జరుగుతున్న ఆందోళనల తీరుపై మరోసారి చర్చ మొదలైంది. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉండాల్సిన ఉద్యమాలు అక్రమ వసూళ్లు, బెదిరింపులు, విధ్వంసాలకు దారితీస్తే విద్యా వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కళాశాలలు విద్యాభ్యాసానికి కేంద్రాలుగా ఉండాలే తప్ప రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒత్తిళ్లకు వేదికలు కాకూడదని వారు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments