HomeCRIMEఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని బలవన్మరణం

ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని బలవన్మరణం

పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా నాగారం వెస్ట్ గాంధీనగర్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని ఓ వైద్య కళాశాలలో ఆప్తాల్మాలజీ (కంటి వైద్యం) పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న దీక్షిత (26) అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments