ఆలూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరు మందిరానికి చెందిన గొల్ల గంగాధర్ (46) వృత్తి వ్యవసాయం చేసుకుంటాడు.
ఈ మేరకు తన ఇంటి ముందు వరండాలో మంచం పై పడుకోగా గుర్తు తెలియని దుండగుకు తలపై పదునైన మారనాయుధంతో కొట్టి హత్య చేశారని తెలిపారు.
ఈ మేరకు మృతుని చెల్లెలు అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు. ఫిర్యాదుదారురాలు పెద్దన్నను తన చిన్న అన్న గొల్ల గంగాధర్ చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు
