నగరంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అలాగే సేవిస్తున్న పలువురిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం రాత్రి సమయంలో ఖానాపూర్ చౌరస్తా వద్ద బీహార్ కి చెందిన రాంనాథ్ మెహత అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రాంనాథ్ మెహత ను పట్టుకొనగా అతని వద్ద 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అక్కడికి వచ్చిన ఏడుగురు గంజాయి కన్స్యూమర్ ని పట్టుకొని, వారికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా పాజిటివ్ గా వచ్చిందన్నారు. గంజాయి అమ్మే వ్యక్తి పై, గంజాయి తాగే వారిపై కేసు నమోదు చేసినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.
