Thursday, April 16, 2026
HomeCRIMEఎట్టకేలకు చిక్కిన రౌడీ షీటర్ సమద్?…..వల పట్టుకున్న అయిదో టౌన్ ఎస్సై ……కీలక విషయాలు వెలుగులోకి...

ఎట్టకేలకు చిక్కిన రౌడీ షీటర్ సమద్?…..వల పట్టుకున్న అయిదో టౌన్ ఎస్సై ……కీలక విషయాలు వెలుగులోకి ?

గత కొంతకాలంగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సమద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రియాజ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రియాజ్ కోసం సీసీఎస్ తో ఆరు అయిదు రూరల్ స్టేషన్ లకు చెందిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు పక్క సమాచారం తో వెళ్ళి అయిదో టౌన్ ఎస్సై మాటు వేసి పట్టుకున్నారు.

ఓ దశలో సమద్ సైతం ఎన్ కౌంటర్ అవ్వబోతున్నాడంటూ ప్రచారం జరిగింది చివరికి తన కొడుకు వదిలేయాలంటూ ప్రాధేయ పడుతూ సమద్ తల్లి వేడుకుంది.

రెండు రోజులక్రితం చిక్కిన సమద్ ను అన్నీ కోణాల్లో విచారించారు ఆయన సాగిస్తున్న దండాలు ?…ఎవరెవరు సహచరులున్నారు ? పోలీసు శాఖ లో కోవర్టు లేవరనేది అరా తీశారు సమద్ చెప్పిన సమాచారం ఇప్పటికే సీపీ వద్దకు చేరింది.

పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ రియాజ్ కు సమద్, సన్నిహితుడు రియాజ్ ను గాలిస్తున్న క్రమంలోనే సమద్ కోసం పోలీసులు గాలించారు కానీ రియాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.రియాజ్ తరువాత పోలీసులకు తానే టార్గెట్ మారడంతో సమద్ అప్రమత్తం అయ్యాడు .

కానీ పోలీసుల్లో బలమైన నెట్ వర్క్ వుండడం తో ఎప్పటికప్పుడు గాలింపు సమాచారం సమద్ తెలుసుకుంటూనే ఉన్నాడు.మరో వైపు కానిస్టేబుల్ హత్య తర్వాత సమద్ ముఠా సాగిస్తున్న అసాంఘిక కార్యకలాపాలతీరు తో సీపీ సైతం విస్తు బోయారు , అందుకే సమద్ ఎలాగైనా పెట్టుకోవాలంటూ సీసీఎస్ అధికారులను పలు మార్లు పురమాయించారు బెదిరింపులకు దిగుతున్న ఈ రౌడీ షీటర్‌ సమద్ ను పట్టుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ​అరెస్ట్ తర్వాత అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!