Thursday, April 16, 2026
HomeEditorial Specialపంచాయతీల్లో కాంగ్రెస్ దే హవా...బాన్సువాడ, బోధన్ లో ఏకపక్ష ఫలితాలు…….మండల కేంద్రాల్లో బోల్తా...……చతికిల పడ్డ బిఆర్...

పంచాయతీల్లో కాంగ్రెస్ దే హవా…బాన్సువాడ, బోధన్ లో ఏకపక్ష ఫలితాలు…….మండల కేంద్రాల్లో బోల్తా………చతికిల పడ్డ బిఆర్ యస్ …..రెంజల్ మినహా …..మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు …..ఐదింటి లో కాంగ్రెస్, మూడు బీజేపీ, రెండు బిఆర్ యస్


గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక పక్ష ఫలితాలు సాధిం చింది. మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిని ఆపార్టీకి చెందిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు.కానీ మండల కేంద్రాల్లో బోల్తా కొట్టింది.పది మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ఐదింటికే పరిమితం కాగా బీజేపీ మూడు బిఆర్ యస్ రెండు మండల కేంద్రాల్లో గ్రామ పంచాయితీ లను గెలిచింది క్షేత్ర స్థాయిలో బలంగా పోటీ ఇస్తుం దనుకున్న బిఆర్ఎస్ పార్టీ నామాత్రంగా ఫలి తాలు సాధించింది.

గతంలో కన్న బీజేపీ ఈసారి మెరుగైన ఫలితాలు దక్కించుకుంది జిల్లాలోని మొదటి దఫా లో 184 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 29 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం అయ్యాయి. 155 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ జరిగింది.

ఈసారి భారీగా పోలింగ్ నమోదు అయింది. మొదటి దఫా ఎన్నికలు జరిగిన గ్రామాలన్ని బోధన్, బాన్సువాడ నియోజక వర్గంలో పరిధిలోనివే కావడం గమనార్హం. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగానే తీసుకు న్నారు. సుదర్శన్ రెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపారు. ఆయన కార్యక్షేత్రంలోకి రాలేదు బోధన్ నియోజకవర్గంలో నవీపేట్ సాలూర మండల కేంద్రాలను కాంగ్రెస్ గెలిచింది కాని రెంజల్ ఎడ్ పల్లి మండల కేంద్రాలను మాత్రం కోల్పోయింది.

రెంజల్ లో బీఆర్ యస్ ఏడ్ పల్లి ని బీజేపీ గెలిచింది.బిఆర్ యస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం మేజర్ గ్రామ పంచాయితీలలో నేరుగా వెళ్లి ప్రచారం చేశారు. సర్పంచ్ అభ్య ర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి తనదే భరోసా అన్నారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలే వచ్చినా మండల కేంద్రాల్లో పోచారం కు షాక్ ఇచ్చారు.

కోటగిరి వర్ని రుద్రూర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే పొతంగల్ మోస్రా లను అనూహ్యంగా బీజేపీ గెలిచింది చందూర్ లో బిఆర్ యస్ గెలుచుకుంది.మరోవైపు బిఆర్ఎస్ నేత లు బిత్తర చూపులు చూశారు. ఈమధ్యే బాజిరెడ్డికి బాన్సువాడ బాధ్యతలు అప్పగించిన ఫలితాల్లో ఆ ప్రభావం ఏమాత్రం కనిపించ లేదు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హడావుడి చేసిన షకీల్ బోధన్ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీనితో కింది స్థాయిలో బిఆర్ యస్ అభ్యర్థులకు కనీస సహకారం లేకుండా పోయింది

రెంజల్. తిరుపతి లలిత.. బీఆర్ఎస్ ..

రుద్రూర్… ఇందూరు సునీత..కాంగ్రెస్

ఎడపల్లి… కందగట్ల రామచందర్… బీజేపీ…

చందూర్..మద్దూరి. మాధవ రెడ్డి. బీఆర్ఎస్..

మోస్రా… గుత్ప భూపాల్ రెడ్డి…బీజేపీ..

సాలూర.. సొక్కం లావణ్యం…కాంగ్రెస్..

వర్ని… మాచవరపు కనకదుర్గ..కాంగ్రెస్

పోతంగల్… కల్లూరీ సంధ్యా…బీజేపీ

కోటగిరి.. బార్లా మధు…కాంగ్రెస్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!