ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి సరైన ఉద్యోగావకాశాలు లేక ప్రైవేట్ రంగంలో ఇతర పనులు చేసుకుంటున్న యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్‌ను వేదికగా చేసుకొని వేలాది మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలోనీ ఐటి హబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ అవకాశాలు లేక వృత్తికి సంబంధం లేని పనులు చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించామనీ అన్నారు.
పలు ప్రముఖ ఐటీ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు చివరి దశలో ఉన్నాయి,” అని తెలిపారు. ఐటీ హబ్‌లో ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహం నిజామాబాద్‌లోని ఐటీ హబ్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు పలు ఐటీ కంపెనీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ ఐటీ హబ్ ద్వారా స్థానిక ఇంజనీర్లకు తమ సొంత ప్రాంతంలోనే ఉపాధి లభిస్తుందని, తద్వారా వలసలు కూడా తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ ఉద్యోగ అవకాశాల పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు.ఈ యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గడుగు గంగాధర్, తాహిర్ బిన్ హందాని, కేశ వేణు, నరాల రత్నాకర్, ధర్మపురి సంజయ్,వేణు తదితరులు పాల్గొన్నారు.
