ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు.బుదవారం ఆయన తన స్వగ్రామమైన అంకాపూర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డి కూడా తమ ఓటును వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని, ప్రతి పౌరుడు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. తన కుమార్తె సుచరితతో కలిసి ఓటు వేయడం సంతోషంగా ఉందని, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలని ఆయన సూచించారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యేను చూసి స్థానిక గ్రామాస్తులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు.
