.భారత ప్రముఖ సైంటిస్ట్ బిజెపి సీనియర్ నాయకులు ఈరోజు బాసర సరస్వతి అమ్మవారి దర్శనం వెళ్తున్న ఎల్లారెడ్డి గారికి నవీపేట్ లో బిజెపి జిల్లా ఐటి సెక్రటరీ పిల్లి.శ్రీకాంత్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీపేట్ లో బిజెపి నాలుగు వార్డ్ మెంబర్లు గెలుచుకోవడం ఆనందించదగ్గ విషయమని, ఇంకా కష్టపడి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగిరేయాలని తెలిపారు.రాబోవు రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పునాది ప్రవీణ్,బండారు.రాజశేఖర్, పునాది నవీన్, జైసింగ్, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు.
