నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల్ నాల్కల్ నుండి సిర్పూర్ వెళ్లే దారిలో ఆటో బైక్ ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కి గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంలో సిర్పూర్ గ్రామానికి చెందిన గొల్లపు ఇంద్రయ్యకు గాయాలు అయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ తక్షణమే అక్కడకు చేరి ప్రథమ చికిత్స చేసి వారిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. ఈఎంటి రాములు, పైలట్ అజయ్ ను అక్కడివారు అభినందించారు.
