HomeTelanganaNizamabadఉపాధి హామీ పేరు మార్పుతో పేదల కడుపు కొట్టే కుట్ర.. (ఎస్.కె.ఎం.) రాష్ట్ర కన్వీనర్, జిల్లా...

ఉపాధి హామీ పేరు మార్పుతో పేదల కడుపు కొట్టే కుట్ర.. (ఎస్.కె.ఎం.) రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్ ల స్పష్టికరణ

ఈజీఎస్ పథకానికి గాంధీ పేరు మార్చి మరోసారి గాంధీ హత్యకు పూనుకున్న మోడీ సర్కార్..ఈజీఎస్ పథకానికి గాంధీ పేరు మార్చి మరోసారి గాంధీ హత్యకు పూనుకున్న మోడీ సర్కార్..ఈజీఎస్ పథకానికి గాంధీ పేరు మార్చి మరోసారి గాంధీ హత్యకు పూనుకున్న మోడీ సర్కార్.. (ఎస్.కె.ఎం.) రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్ ల స్పష్టికరణ

ఉపాధి హామీ పేరు మార్పుతో కేంద్రం పేదల కడుపు కొట్టే కుట్రకు చేస్తున్నారని సంయుక్త కిషన్ మోర్చా(ఎస్.కె.ఎం.) రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్ లు ధ్వజమెత్తారు.ఈజీఎస్ పథకానికి గాంధీ పేరు మార్చి మరోసారి గాంధీ హత్యకు పూనుకున్నారని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పెరుమార్చి నిరుగార్చే కేంద్రం కుట్రలకు నిరసనగా జిల్లా తపాలా జిల్లా కార్యాలయం ముందు సంయుక్త కిషన్ మోర్చా(ఎస్.కె.ఎం.) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంయుక్త కిషన్ మోర్చా(ఎస్.కె.ఎం.) రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్ లు మాట్లాడుతు..


కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ కార్పోరేట్ శక్తుల ప్రయోజనాల కోసం దేశంలో ఉన్న గ్రామీణ వ్యవసాయ కూలీల జీవితాలను పణంగా పెడుతున్నారన్నారనీ అన్నారు. ఇప్పటికీ పని లేక వ్యవసాయ కూలీలు అన్నము రామచంద్రా అంటుంటే మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పేరు మారుస్తున్నమని పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టంను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారన్నారనీ అన్నారు.

కేంద్రం గ్రామీణ ఉపాదానికి నిధుల్లో 40 శాతం రాష్ట్రాలు భరించాలని వారిపై రుద్దుతూ పూర్తిగా బాధ్యత నుంచి తప్పుకుంటుందన్నారు.

కార్పొరేట్స్ కంపెనీలకు లాభం చేకూర్చాడానికే కూలీలపనితో పాటు మొత్తం ఉపాధి హామీ లేకుండా రద్దు చేసే కేంద్రం కుట్రలకు నిరసనగా జిల్లా తపాలా జిల్లా కార్యాలయం ముందు తపాలా జిల్లా కార్యాలయం ముందు సంయుక్త కిషన్ మోర్చా(ఎస్.కె.ఎం.) చేపట్టిన నిరసన
గ్రామీణ ఉపాధి హామీ పథకం పెరుమార్చి నిరుగార్చే కేంద్రం కుట్రలకు పునుకుంటుంది అని వారు పేర్కొన్నారు.

తపాలా జిల్లా కార్యాలయం ముందుకార్యక్రమంలో ఆందోళన కారులను ఉద్దెశించి
కార్యక్రమంలో కంజార భూమయ్య అధ్యక్షత వహించాగా.. ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పెద్ది వెంకట రాములు, అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే రాజన్న, ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వేల్పూర్ భూమయ్య, వ్యవసాయ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు వెంకటేష్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులుకే గంగాధర్ జి కిషన్, ఏఐయుకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ దామోదర్, బి కిషన్, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్, ఎం అనిస్,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుఎస్ కిషోర్, బి అశోక్, ఏఐకేఎంఎస్నాయకులు బి గంగారెడ్డి,గంగాధర్, ఐ ఎఫ్ టి యు నాయకులు వరదయ్య, సాయ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ సాయ గౌడ్, బొంబాయి గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments