Sunday, April 26, 2026
HomeTelanganaNizamabadప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్..ప్రధాన కార్యదర్శిగా వాగ్మారే సుభాష్, కోశాధికారిగా రాజ్‌కుమార్ ఎన్నిక

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్..ప్రధాన కార్యదర్శిగా వాగ్మారే సుభాష్, కోశాధికారిగా రాజ్‌కుమార్ ఎన్నిక

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మొత్తం 260 మంది సభ్యులున్న క్లబ్‌లో 245 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ పదవుల కోసం భారీగా అభ్యర్థులు పోటీ పడటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్థరాత్రి 11:30 గంటల సమయంలో ఎన్నికల అధికారులు తుది ఫలితాలను ప్రకటించారు.


విజేతలు వీరే..


అధ్యక్షుడు: పంచరెడ్డి శ్రీకాంత్
ప్రధాన కార్యదర్శి: డాక్టర్ వాగ్మారే సుభాష్
కోశాధికారి: రాజ్‌కుమార్
ఉపాధ్యక్షులు: జైన సంగీత, సతీష్ గౌడ్, గోవింద్‌రాజ్
ఆర్గనైజింగ్ సెక్రెటరీ: రాజు
సంయుక్త కార్యదర్శులు: రవినాయక్, సురేష్, అంజనేయులు ఎన్నికయ్యారు.


ఎన్నికైన ప్రతినిధులను పలువురు సీనియర్ విలేకరులు, తోటి జర్నలిస్టులు అభినందించారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!