ఆరుగురు పేకాటరాయులు అదుపులో… నగదు, సెల్ఫోన్లు, బైకులు స్వాధీనంనిజామాబాద్ :
నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
మిర్చి కాంపౌండ్‌లోని అశోక్ నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురు పేకాటరాయులను అదుపులోకి తీసుకున్నారు.వన్ టౌన్ సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం…పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాటరాయుల వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రెండు బైకులు, రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.నగరంలో అక్రమ కార్యకలాపాలకు తావివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు. పేకాట వంటి నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.అక్రమ పేకాట వల్ల కుటుంబాలు, సమాజం దెబ్బతింటాయని, ఇలాంటి కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
