Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadటార్గెట్ …కార్పొరేషన్ ..!వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్న అర్వింద్ ……ఓడిన స్థానాల్లో ఫోకస్

టార్గెట్ …కార్పొరేషన్ ..!వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్న అర్వింద్ ……ఓడిన స్థానాల్లో ఫోకస్

మున్సిపల్ ఎన్నికల కోసం యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో బీజేపీ వ్యూహాలకు పదను పెడుతుంది. ఈసారి ఎలాగైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం సాధించాలని పట్టుదలతో ఉంది రెండు సారి ఎంపీ గా గెలిచిన అర్వింద్ ఈసారి మేయర్ పీఠం మీద గురి పెట్టారు.

గతంలో త్రుటి లో చేజారిన మేయర్ స్థానం ను ఈసారి చేజిక్కించుకోవాలని అర్వింద్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన గత కొద్దీ నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నారు.60 డివిజన్ లున్న నగరంలో 16 -18 స్థానాల్లో యంఐయం కు బలమైన పట్టు ఉంది ఇవి కాకుండా మిగితా స్థానాల్లో ఎలా గెలవాలనే విషయంలోనే ఆయన ఎడతెగని కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన వ్యవహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

గతంలో కన్న ఈసారి పార్టీకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ల రూపంలో సంఖ్య బలం పెరిగింది. అందుకే మేయరు స్థానం దక్కించుకోవడం దుస్సాధ్యమేమి కాదనే ఆలోచనలో అరవింద్ ఉన్నారు అసలు జడ్పి పీఠం ఈసారి పక్కగా గెలుస్తామని అందుకు తగ్గట్టుగానే పార్టీ బలం పెంచామని అర్వింద్ అనేక వేదికల మీద చెప్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ముందుకు రావడంతో అర్వింద్ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం నే టార్గెట్ గా పెట్టుకొని వ్యూహాత్మక కార్యాచరణ తో పనిచేస్తున్నారు.

గతంలో మెజార్టీ స్థానాలు సాదించినప్పటికీ యంఐయం మద్దతు తో బిఆర్ యస్ మేయర్ పీఠం ను ఎగేసుకుపోయింది. ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యే ల సంఖ్యా బలం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. బిఆర్ యస్ అధికారంలో ఉన్నా సరే బీజేపీ నగరంలో క్లిన్ స్వీప్ చెయ్యడం అధికార పార్టీకే మింగుడు పడలేదు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ల ను అంగట్లో పశువులు కొన్నట్లు ఒక్కో కార్పొరేటర్ కు పది నుంచి 20 లక్షల నగదు దళిత బంధు తో పాటు ఇతర ఆర్థిక లబ్ది ఎర గా వేసింది.

దాదాపు డజన్ మంది కి పైగా బీజేపీ కార్పొరేటర్లు బిఆర్ యస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అధికార యావ ఆర్థిక అవసరాల కొరకు కార్పొరేటర్లు పార్టీ వీడకుండాకట్టడి చెయ్యడానికి అర్వింద్ ఆసక్తి చూపలేదు.

ఇలాంటి చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి మేయర్ పీఠం విషయంలో అర్వింద్ పట్టుదలతో పనిచేస్తున్నారు ఇప్పటికే రెండు పర్యాయాలు నగరంలోసొంతగా సర్వే లు చేయించిన అర్వింద్ పార్టీ ప్రాబల్యం లేని డివిజన్ లో కొత్త వారిని తెరమీదికి తేవడానికి సమాయత్తం అవుతున్నారు గతంలో పార్టీ ఓడిపోయిన డివిజన్ లతో పాటు కార్పొరేటర్ ల పనితీరు అద్వానంగా ఉన్న డివిజన్ లలో కొత్త వారిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు సర్వే నివేదిక ల ఆధారంగా నే అభ్యర్థులను ఖరారు చెయ్యబోతున్నారు

మరో వైపు బలమైన సామజిక వర్గం ప్రజల్లో పలుకు బడి ఉండి క్రియాశీలకంగా ఉన్న వారిని ఉన్నపలంగా పార్టీలోకి తేవడానికి తనకు సన్నిహితంగా ఉండే ఒకరిద్దరిని పురమాయించారు కూడా. గతంలో గెలిచిన స్థానాలకు అదనంగా మరో అరడజన్ స్థానాలు ఎక్కువగానే గెలువాలనేది కమలనాధులు ఆలోచనగా ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!