Sunday, April 19, 2026
HomeCRIMEజిఎస్టి అధికారుల అత్యుత్సహం వల్లే నా మీద కేసు ......ప్రశాంత్ రెడ్డి వి దొమ్మరి వేషాలు...

జిఎస్టి అధికారుల అత్యుత్సహం వల్లే నా మీద కేసు ……ప్రశాంత్ రెడ్డి వి దొమ్మరి వేషాలు ……ఆరెంజ్ సునీల్ రెడ్డి

కొంతమంది జీఎస్టీ అధికారులు అత్యుత్సాహం వల్లే ఆరెంజ్ సంస్థపై విచారణ జరిగిందని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మరియు మిగతా రాష్ట్రాలలో 5 శాతం జీఎస్టీని బస్సుల మీద యధావిధిగా కట్టేవాళ్ళం కానీ మొత్తం మీద 12 శాతం జీఎస్టీ కట్టాలని ఒత్తిడి చేశారు దానివల్ల 28 కోట్లు అదనంగా జిఎస్టి కట్టాలని నాపై,సంస్థ పై విచారణ చేపట్టారు విచారణ సందర్భంగా నన్ను అరెస్టు చేయాలని చూశారు కోర్టుకు వెళ్లేసరికి ఒక వ్యక్తిని కావాలని ఇబ్బంది పెడుతున్నారని కోర్టు గ్రహించి నన్ను అరెస్టు చేయవద్దని జడ్జిమెంట్ ఇచ్చిందన్నారు

ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రభుత్వానికి కట్టాల్సిన పనులన్నీ కడుతుంది ఇది కేవలం వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే విచారణ జరిగిందన్నారు *విచారణ సందర్భంగా టీ న్యూస్ మరియు నమస్తే తెలంగాణ పత్రికలు నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి విషయాన్ని రాజకీయం చేయాలని చూశాయన్నారు

కాంగ్రెస్ పార్టీని నన్ను వ్యక్తిగతంగా బదనం చేయాలని చూశారు కానీ అది సాధ్యపడలేదు కోర్టు తీర్పు తర్వాత వెంటపడ్డ టీవీ ఛానళ్లు ఒక్కటి కూడా కనిపించకుండా మాయమయ్యాయి

కావాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గతంలోని తన పరిచయాలను వాడుకొని వారి టీవీ ఛానల్లలొ మరియు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు కోర్టు తీర్పే వారందరికీ చెంపపెట్టు అయిందన్నారు

నియోజకవర్గంలో ఇసుకను తక్కువ ధరకు అందిస్తే వారి కళ్ళు మండుతున్నాయి వారి హయాంలో 6 వేలకు తక్కువ ధరకు ఇసుక ఏనాడు లేదు ఇప్పుడు 3000 లోపు వస్తే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తక్కువ ధరకు ఇసుకను అందిస్తే ఇసుక మాఫియా అని అంటున్నారు ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే ఈ విషయంపై చర్చకు రావాలి

బట్టాపూర్ లో క్రషర్ ద్వారా పదివేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి ప్రభుత్వానికి చుట్టుపక్కల రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది ఇలా అదనంగా క్యూబిక్ మీటర్లు తవ్వి ప్రభుత్వానికి 1120కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు అలాగే కరెంటు బిల్లుల ద్వారా 52 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.

మేం అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు కక్షపూరితంగా వ్యవహరించలేదు మేము వీటిపై విచారణ జరపాలని ఎవరి మీద ఒత్తిడి తేలేదు చట్టం మీద గౌరవంతో ఉన్నాం..ప్రశాంత్ రెడ్డి ధర్మ సూత్రాలు చెబుతూ దొమ్మరి వేషాలు వేస్తున్నారు

ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి లోపు ఏ తారీకునైనా తీసుకొని ముఖాముఖి చర్చా వేదిక పెట్టాలి సమయం తేదీ తెలపాలి ఎవరు అవినీతిపరుడు ఎవరు బకాసురుడు తేల్చుకుందాము ఒకవేళ చర్చకు రాకుంటే బట్టాపూర్ దొంగగా ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరఫున నామకరణం చేస్తాం

ఇకనైనా ప్రశాంత్ రెడ్డి చిల్లర వేషాలు దొంగ పనులు మానుకొవాలి 120 కోట్లు ఖర్చుపెట్టి గెలిచి ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు ఆయన దొంగ పనులు మానుకోవాలని హితవు పలుకుతున్నాన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!