Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadమున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం …..ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ….. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం …..ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ….. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్​ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో న ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకే విడతలో ఎన్నికలు జరిగేలా ప్రాథమిక షెడ్యూలు తయారైంది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా, వార్డులవారీ పోలింగ్​ స్టేషన్లు, ఎన్నికల బాధ్యతలు, నియామకంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్​లకు ఎస్​ఈసీ దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్​ కూడా పూర్తయినట్లు సమాచారం. దీని ప్రకారం మున్సిపోల్స్​కు ఈ నెల 16 షెడ్యూల్​ విడుదల కానుంది. అలాగే జనవరి 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్​ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం జనవరి 24న గుర్తులు కేటాయిస్తారు. 25 నుంచి ప్రచారం మొదలవుతుంది. ఫిబ్రవరి 1న ప్రచారం ముగింపు, అదే నెల 3న ఎన్నికలు, 6న కౌంటింగ్​ ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్​ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!