నిజాం నిరంకుశ పాలనకు చిహ్నంగా ఉన్న ‘నిజామాబాద్’ పేరును తొలగించి, జిల్లాకు పూర్వ నామమైన ‘ఇందూర్’ గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్ నేతృత్వంలో 25వ డివిజన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి బానిసత్వ గుర్తులను చెరిపివేసి, మన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా పేరు మార్పు జరగాలని వారు నినదించారు.
“నిజామాబాద్ వద్దురా – ఇందూర్ ముద్దురా” అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పల్నాటి కార్తీక్ మాట్లాడుతూ.. నిజాం నవాబుల అరాచక పాలనకు గుర్తుగా ఉన్న పేరును కొనసాగించడం జిల్లా ప్రజల ఆత్మగౌరవానికి విఘాతమని పేర్కొన్నారు.
చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఇందూర్’ పేరును వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జగదీష్, నిరంజన్, చరణ్, రాకేష్, సంతోష్, యోగేష్, సాయి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
