HomeCRIMEసెల్ ఫోన్ షాప్ లో చొరబడ్డ దొంగలు ….వెంటాడి పట్టుకున్న స్థానికులు …బోధన్ రోడ్ లో...

సెల్ ఫోన్ షాప్ లో చొరబడ్డ దొంగలు ….వెంటాడి పట్టుకున్న స్థానికులు …బోధన్ రోడ్ లో ఘటన

దొంగలు నగరంలో మరోసారి హల్ చల్ చేసారు బోధన్ రోడ్డు లో సెల్ ఫోన్ షాప్ లో చొరబడ్డారు. కానీ ఓ వ్యక్తి కర్ర ఎదురించడంతో పారిపోయారు కానీ సదరు వ్యక్తి వెంటబడి పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.

బోధన్ రోడ్ లో మైఫైల్ హోటల్ పక్కనే ఉన్న కాంప్లెక్స్ లో ఉన్న మొబైల్ షాప్ షట్టర్ ను పైకి లేపి ముందు ఒకరు చొరబడ్డారు కానీ ఈలోపు దొంగల అలజడి గమనించిన ఓ వ్యక్తి గట్టిగా అరవడంతో బయట ఉన్న దొంగ పారిపోయాడు కానీ అప్పటికే లోపలి చొరబడ్డ వ్యక్తి ని పట్టుకోవడానికి సదురు వ్యక్తి కర్ర తీసుకోని కాపలా ఉన్నాడు.

బయటికి వచ్చిన దొంగ ఒక్క ఉదుటున పరుగెత్తాడు కానీ కొంత దూరం దాక వెంటాడి పట్టుకున్నాడు ఈలోపు గస్తీ పోలీసులు సైతం హుటాహుటిన వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments