HomeCRIMEభీమ్‌గల్‌లో గంజాయి విక్రేత అరెస్ట్..

భీమ్‌గల్‌లో గంజాయి విక్రేత అరెస్ట్..

భీమ్‌గల్‌లో గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారుల కథనం ప్రకారం.. భీమ్‌గల్ మండలం బాబానగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ బృందం మెరుపు దాడి చేశారు.

ఈ మేరకు మెండోరా గ్రామానికి చెందిన కనక రాహుల్ (25) అనే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి 83 గ్రాముల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్ రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో భీమ్‌గల్ ఎక్సైజ్ ఎస్సై గోవర్ధన్, సిబ్బంది దత్తాద్రి, జగదీష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments