Tuesday, January 20, 2026
HomeCRIMEనిజామాబాద్‌లో వ్యభిచార గృహాలపై సీసీఎస్ మెరుపుదాడులు..

నిజామాబాద్‌లో వ్యభిచార గృహాలపై సీసీఎస్ మెరుపుదాడులు..

నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార వ్యాపారంపై సీసీఎస్ పోలీసులు కొరడా ఝుళిపించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఉత్తర్వుల మేరకు, సీసీఎస్ ఏసీపీ (ఇంచార్జ్) మస్తాన్ వాలి పర్యవేక్షణలో నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్, ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీసీఎస్ బృందం ఆయా గృహాలపై దాడులు చేసి నలుగురు విటులు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనంనిందితుల వద్ద నుంచి రూ. 27,290 నగదు, 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!