ఈసారి నిజమాబాద్ మేయర్ పీఠం ను దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అర్వింద్ ఇప్పటికే బలమైన అభ్యర్థుల కోసం కసరత్తులు చేస్తున్నారనే ప్రచారం పార్టీవర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. ఆయా డివిజన్ లలో ఆశావహులు ఈసారి పోటెత్తే అవకాశం కనిపిస్తుంది.
నిజామాబాద్ నగరానికి వచ్చిన అర్వింద్ ను కలుస్తున్న నేతలు టికెట్ కోసం వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా ఈసారి సిట్టింగ్ లలో ఎంత మందికి మళ్ళీ టికెట్ లు ఇస్తారనే చర్చ ఎక్కువగా ఉంది.
60 డివిజన్ ల్లో బీజేపీ గతంలో 24 మంది గెలిచారు కానీ బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో అర్బన్ ఎమ్మెల్యే గెలిచిన బీజేపీ కార్పొరేటర్ లను అంగట్లో సరుకుగా బేరం ఆడి కొనుగోలు చేసారు. 12 మంది కార్పొరేటర్లు బీజేపీ ను వీడి కారు పార్టీలో వెళ్లారు అనూహ్య ఫిరాయింపు వ్యవహారం బీజేపీ సంస్థాగతంగా దెబ్బ తీసింది. ఎంపీ అర్వింద్ సైతం గతంలో అనేక సార్లు దుయ్యబట్టారు.
కానీ పార్టీ ని వీడిని కార్పొరేటర్ల విషయంలో అర్వింద్ ఒకింత అసహనం కు గురయ్యారు. కానీ బిఆర్ యస్ అధికారం కోల్పవడంతో పార్టీ పిరాయించిన కార్పొరేటర్ల కు జ్ఞానోదయం అయింది.దీనితో లోకసభ ఎన్నికల బరిలోకి రెండో సారి అర్వింద్ దిగిన నేపథ్యంలో కొంత మంది జంప్ జిలానీ లు తిరిగి బీజేపీ లోకి రావడానికి సిద్ధం అయ్యారు వీరిలో మల్లేష్ యాదవ్ ఆకుల శ్రీనివాస్ లు ముందుకు వచ్చి మిగితా ఫిరాయింపు దారులతో భేటీ అయ్యారు.
లోకసభ ఎన్నికల నేపథ్యంలో అర్వింద్ సైతం కదన లేక పోయారు. దీనితో 8 మంది తిరిగి బీజేపీ లోకి వచ్చేసారు కానీ మరో ముగ్గురిని మాత్రం తీసుకోవడానికి అబ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనితో వారు యదావిదిగా బిఆర్ యస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. మరో కార్పొరేటర్ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
దాదాపు ఏడాది క్రితం తిరిగి బీజేపీ లోకి వచ్చిన జంప్ జిలానీ లకు ఈసారి మరోసారి టికెట్ ఇస్తారా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది వీరికి టికెట్ లు ఇచ్చే విషయంలో ఎంపీ అర్వింద్ నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ ఆయన ఎక్కడ స్పష్టత ఇవ్వడం లేదు. శుక్రవారం
ఈ జంపింగ్ లు అరడజన్ మంది అర్వింద్ ను కలవడానికి వెళ్లారు తమ పరిస్థితి వాకబు చేసారు. వీరిలో ఒకరిద్దరి విషయంలోనే సానుకూలంగా మాట్లాడిన అర్వింద్ మిగితా వారిని గట్టిగా క్లాస్ పీకారు. టికెట్ లు ఎందుకు ఇవ్వాలి గెలిచి మళ్ళీ ఈసారి కాంగ్రెస్ లోకి వెళ్తారా ? అంటూ దెప్పి పొడిచారు.
అయినా గెలిచివారికే టికెట్ లు అదికూడా సర్వే లో అనుకూలంగా వచ్చే వారికే అంటూ స్పష్టం చేసారు. సరే జంపింగ్ ల సంగతి ఎలా ఉన్న పార్టీలో కొనసాగుతున్న మిగితా 12 మంది సిట్టింగ్ కార్పొరేటర్ లలో అందరికి టికెట్ రావడం అనుమానమే ! వీరిలో అరడజన్ మందికి మాత్రమే స్థానికంగా సానుకూలత ఉందనేది అర్వింద్ సొంతగా చేయించిన సర్వేల్లో తేలిందని పార్టీ వర్గాల్లో టాక్ ! పార్టీ మారకుండా ఉన్న సరే సిట్టింగ్ లందరికి గంప గుత్తగా టికెట్ లు ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు.
బీజేపీ కార్పొరేటర్ లుగా ఉండి మున్సిపల్ వ్యవహారాల్లో గట్టిగా గొంతెత్తక పొగ చాల మంది కార్పొరేటర్లు డివిజన్ లలో యథేచ్ఛగా వసూళ్ల దందా కు తెగబడ్డారు.
కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ నియామకాలు ….దళిత బంధు లబ్ది వంటి వ్యవహారాల్లో బిఆర్ యస్ ప్రతినిధుల తో అంటకాగారు.కానీ ప్రతికూల పరిస్థితులను అధిగమించి కార్పొరేషన్ వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన అరడజన్ మంది విషయంలోనే సానుకూలత ఉంది అందుకే వీరి కి ఈసారి టికెట్ లు ఇచ్చే ఛాన్స్ వుందని సీనియర్ నేత ఒకరు ఇదీసంగతి కి చెప్పారు
