HomeLaw and Orderజిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త.

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు.

పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు.

జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ దిశగా తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments