HomeCRIMEనగరంలోని తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరీ..నగరంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు...

నగరంలోని తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరీ..నగరంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టించారు.

గృహస్థులు ఊరెళ్లిన సమయం చూసి రెచ్చిపోయిన కేటుగాళ్లు.. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు.ఈ ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.రూరల్ ఏస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏక శిల నగర్ ప్రాంతానికి చెందిన ప్రసాద్ ఈ నెల 11న కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి కర్నాటక వెళ్లినట్లు తెలిపారు.

ఈ మేరకు అది గమనించిన గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడినట్లు తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం తెలపగా బుదవారం ఇంటికి చేరుకుని చూడగా బీరువాలో నుంచి 23 గ్రాముల బంగారం,13 తులాల వెండి నగలు,సుమారు రూ 1,20,000 నగదు అపహరించినట్లు తెలిపారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments