HomeCRIMEనగరంలో సంక్రాంతి వేళ ‘మద్యం’ వీరంగం..

నగరంలో సంక్రాంతి వేళ ‘మద్యం’ వీరంగం..

సంక్రాంతి పండుగ పూట నగరంలో మద్యం మత్తులో కొందరు యువకులు హద్దులు దాటారు. గాలిపటాల కోలాహలం మధ్య చిన్నపాటి వివాదం కాస్తా రక్తపాతానికి దారితీసింది. ఆనంద్‌నగర్ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్‌నగర్‌కు చెందిన కార్తీక్ తన ఇంటి మేడపై గాలిపటం ఎగురవేస్తున్నాడు. అదే సమయంలో అదే గల్లీకి చెందిన సంతు అనే యువకుడు మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. కార్తీక్ వద్ద ఉన్న మద్యాన్ని సంతు తాగేశాడు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కార్తీక్, ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని సంతును కోరాడు. సాధారణంగా అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన సంతు.. “నన్నే డబ్బులు అడుగుతావా?” అంటూ కార్తీక్‌తో గొడవకు దిగాడు. అంతటితో ఆగక తన తమ్ముడు బాలుని కూడా అక్కడికి పిలిపించాడు. ఇద్దరూ కలిసి కార్తీక్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో సంతు తన చేతిలో ఉన్న బీరు సీసాతో కార్తీక్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన కార్తీక్‌ను నిందితులు చితకబాది అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితుడి అరుపులు విని చేరుకున్న స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments