ఈనెల 18 నుండి ముంబైలో జరిగే 42 కిలోమీటర్ల మార్తాన్ టోర్నమెంట్ కు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి శ్రీనివాస్ పాల్గొంటున్నారు. శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట నివాసి.
ఈ టోర్నమెంట్ ముంబైలోని కొలువరి గ్రామం, విద్యానగరి, తూర్పు ముంబై,యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో జరిగే టోర్నమెంట్ పాల్గొంటాడు. ఈయన ఇంతకుముందు బెంగళూరు కలకత్తా లో జరిగిన 42 కిలోమీటర్స్ మార్తాన్లో పాల్గొని పథకాలు సాధించారు.
ముంబైలో జరిగే మార్తాల్లో కూడా పథకం సాధించాలని ఆయన నిత్యం సాధన చేసే జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ అసోసియేషన్ కార్యవర్గం పథకంతో తిరిగి రావాలని తెలిపారు. ఆ టోర్నమెంట్లు పాల్గొనే శ్రీనివాస్ అప్లికేషన్ నెంబర్ 11172, అలాగే బిబ్ నంబర్ 14638 అని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
