నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ విద్యా గణపతి సాహితీ కళా పీఠం వారు జాదూ రంగనాథ్ 4 దశాబ్దాల సుదీర్ఘ ఇంద్రజాల సేవలను గుర్తించి జాదు యుగంధర్ రంగనాథ్ దంపతులను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
ప్రముఖకవి, అష్టావధాని డాక్టర్ గణపతి అశోక్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహోపాధ్యాయ మేడవరం అనంత కుమార శర్మ, సభా సామ్రాట్ వి.పి. చందన్ రావు, కవన కిరీటి కాసర్ల నరేశ్ రావు, పధ్యకోకిల డాక్టర్ బొచ్కర్ ఓం ప్రకాశ్ పాల్గొన్న
ఈ కార్యక్రమం చిత్కళ శ్రీనివాస్ శర్మ రచించిన పుస్తకావిష్కరణ సభలో జరిగింది. జీవన సాఫల్య పురస్కారంచే సత్కారం పొందిన జాదు రంగనాథ్ దంపతులను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
