Saturday, April 18, 2026
HomeDevotionalదుర్గమ్మ జాతర ను విజయవంతం చేయండి..శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయ అధ్యక్షులు అమంద్ విజయ్...

దుర్గమ్మ జాతర ను విజయవంతం చేయండి..శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయ అధ్యక్షులు అమంద్ విజయ్ కృష్ణ

ఈరోజు శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో ఈనెల 21 నుండి 23 వ తేదీ వరకు దుర్గాదేవి దేవాలయ 4 వ వార్షికోత్సవ సందర్బంగా దుర్గమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షులు అమంద్ విజయ్ కృష్ణ అన్నారు

ఈ సందర్బంగా విజయ్ కృష్ణ మాట్లాడుతూ 21 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ వసంత పంచమి వరకు గుమస్తా కాలోని శ్రీ దుర్గాదేవి దేవాలయం ఉత్సవాలు కొనసాగుతాయి అన్నారు ఈ సందర్బంగా వాటి యొక్క కరపత్రాలను ఆవిష్కరణ చేశారు a 21 వ తేదీ బుధవారం ఉదయం బోనాల తో కార్యక్రమం ప్రారంభమవతుంది అన్నారు ఇట్టి కార్యక్రమలకు ఇందూరు ప్రజలు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం

ఈ కార్యక్రమం బ్రాహ్మశ్రీ శ్రీవిద్యఉపాసకాలు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతాయి అన్నారు పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి

ఈ కార్యక్రమం లో కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, కార్యదర్శి అమంద్ రాజేష్, సభ్యులు గంగోనె సంతోష్, పండ్రావీసం హరీష్, దయవార్ మురళి కాలోని వాసులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!