HomeEditorial Specialరిజర్వేషన్ ల ఫై ఎడతెగని ఉత్కంఠ .......మేయర్ స్తానం మీద అందరి చూపు .........కసరత్తులు పూర్తీ...

రిజర్వేషన్ ల ఫై ఎడతెగని ఉత్కంఠ …….మేయర్ స్తానం మీద అందరి చూపు ………కసరత్తులు పూర్తీ చేసిన ఎన్నికల సంఘం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత కీలకమైన డివిజన్ల వారీ రిజర్వేషన్ల ప్రక్రియ ఫై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మేయర్ స్థానం రిజర్వేషన్ విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇందుకు సంబందించి కసరత్తులు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో తుది ప్రకటన వెలుబడే ఛాన్స్ ఉంది. 60 డివిజన్ లున్న నగరంలో ఏ ఏ వర్గాలకు ఎన్ని డివిజన్ లు దక్కబోతున్నాయనేది స్పష్టం చేసింది.

అన్ రిజర్వ్డ్ మొత్తం 30 స్థానాలు. ఇందులో జనరల్ 14, మహిళలకు 16 కేటాయించారు. *బీసీ కేటగిరీ* : మొత్తం 24 స్థానాలు. ఇందులో జనరల్ 12, మహిళలకు 12 కేటాయింపు. *ఎస్సీ కేటగిరీ* మొత్తం 5 స్థానాలు. జనరల్ 3, మహిళలకు 2 కేటాయించారు. ఎస్టీ కేటగిరీ ఒక స్థానం (1) కేటాయించారు.

అయితే బీసీ లకు ఏ ఏ డివిజన్ దక్కబోతున్నాయి ఏ డివిజన్ లు ఆన్ రిజర్వ్ గా ఉండబోతున్నాయనేది ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠగా మారాయి. మరో వైపు కీలకమైన మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కనుందనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.

వరసగా రెండు పర్యాయాలు బీసీ మహిళలు మేయర్ గా లుగా పనిచేసారు. కార్పొరేషన్ అయ్యాక మొట్టమొదటి సారిగా బీసీ జనరల్ గా మేయర్ స్థానం రిజర్వ్ కాగ కాంగ్రెస్ కు చెందిన ధర్మపురి సంజయ్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇదివరకు బీసీ మహిళా కు కేటాయించారు అంతకు ముందు జనరల్ మహిళా కు రిజర్వ్ అయింది మొన్నటి సారి బీసీ సామజిక వర్గం కు చెందిన నీతూ కిరణ్ మేయర్ గా ఐదేళ్లు పనిచేసారు.

అంతకు ముందు మహిళా జనరల్ రిజర్వ్ అయినప్పటికీ బీసీ మున్నూరు కాపు సామజిక వర్గం కు చెందిన సుజాత కు మేయర్ అవకాశం దక్కింది. నాల్గో సారి మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కబోతుందనేది ఆసక్తిగా మారింది. మేయర్ స్థానం జనరల్ కేటగిరి కి రాబోతుందంటు రాజకీయ పార్టీల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

ఈ మేరకు కాంగ్రెస్ బీజేపీ ల్లో ఇద్దరు మహిళా నేతల పేర్లు సైతం తెరమీదికి వచ్చేసాయి. ఈసారి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్ధంగా సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగా నే 42 మందిబీసీ లకు డివిజన్ లలో టికెట్ లు ఇవ్వడానికి అధికార పార్టీ సమాయత్తం అవుతుంది.

బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ గా తలబడబోతున్నాయి.మైనార్టీ ఏరియాలో యంఐయం ఎప్పటిలాగే పాగ వెయ్యబోతున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments