HomeTelanganaNizamabadఅరవింద్ అనుభవిస్తున్న స్థాయి కాంగ్రెస్ పెట్టిన బిక్షే!దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికలకు రండి..సింగరేణి విషయంలో కేటీఆర్,...

అరవింద్ అనుభవిస్తున్న స్థాయి కాంగ్రెస్ పెట్టిన బిక్షే!దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికలకు రండి..సింగరేణి విషయంలో కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు “పసలేనివి”పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం.

ఎంపీ అరవింద్ ప్రస్తుతం అనుభవిస్తున్న స్థాయి, హోదా అంతా కాంగ్రెస్ పెట్టిన బిక్షేనని, విమర్శలు చేసే ముందు తన గతాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. తన పుట్టుపూర్వోత్తరాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో ఉండబట్టే మీ కుటుంబానికి ఈ ఆర్థిక స్థితిగతులు, గౌరవం దక్కాయి. మీ తండ్రి కాంగ్రెస్‌లో లేకపోతే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండేవారా?” అని ప్రశ్నించారు. బుదవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు కేవలం దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. “దేవుడి పేరు, శ్రీరాముని నామం స్మరించకుండా దమ్ముంటే ఎన్నికల బరిలోకి రావాలి. కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడిగితే వీరికి పదివేల ఓట్లు కూడా రావు” అని సవాల్ విసిరారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన జిల్లాకు స్మార్ట్ సిటీని తెచ్చుకున్నారు. నిజామాబాద్ కంటే తక్కువ జనాభా, ఆలస్యంగా మున్సిపాలిటీ అయిన కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుంటే.. అరవింద్ ఎందుకు స్మార్ట్ సిటీని తీసుకురలేకపోతున్నారని ప్రశ్నించారు.

రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్ ఈ జిల్లాకు ఏం తెచ్చారు?” అని సూటిగా ప్రశ్నించారు. నిజామాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.కేటీఆర్, హరీష్ రావులపై మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం:బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గత పదేళ్ల కాలంలో వారు చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.సింగరేణి కాలరీస్‌లో సృజన్ రెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నారంటూ కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు “పసలేనివి” అని మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు.

సృజన్ రెడ్డికి దక్కిన కాంట్రాక్టులన్నీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చినవి కావని ఆయన స్పష్టం చేశారు.సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంధువు కావచ్చు, కానీ నిబంధనల ప్రకారమే ఆయనకు గతంలో టెండర్లు దక్కాయని..

కేవలం బంధువు అయినంత మాత్రాన కాంట్రాక్టులు చేయకూడదనే నిబంధన ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు.”మీ దగ్గర నిజాలుంటే చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా కాంగ్రెస్ మీద బురదజల్లి పారిపోవాలని చూడకండి” అని ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు.ఫోన్ ట్యాపింగ్ ఒక ‘భయంకర నేరం’ కేవలం రాజకీయ నాయకులవే కాకుండా, బడా వ్యాపారవేత్తలు, సినీ నటుల వ్యక్తిగత విషయాల్లోకి కూడా దూర్చి వారిని బెదిరించారని ఆరోపించారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం నమ్మకుండా వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని ఎద్దేవా చేశారు. ఈ నేరంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని దోపిడీకి గురిచేశారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖల్లో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల లబ్ధి కోసం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహిర్ బిన్ హందాని,గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్,రాంభూపాల్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments