మున్సిపల్ ఎన్నికల కోసం ఇంచార్జ్ గా నియామకం అయిన మంత్రి ఉత్తమ్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే గాంధీ భవన్ వేదిక జిల్లా నేతలతో భేటీ అయినఉత్తమ్ మూడు రోజుల గడువులోనే కార్యక్షేత్రంలోకి వస్తున్నారు కాసపేట్లో జిల్లాకు ఎంట్రీ ఇస్తున్నారు నిజామాబాద్ ఆర్మూర్ లలో కాంగ్రెస్ శ్రేణులతో వీరి విరిగి సమావేశం కానున్నారు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్ బీమ్ గల్ మెట్ పల్లి కోరుట్ల జగిత్యాల్ మున్సిపాలిటీ లకు సంబంధించి క్యాడర్ తో మమేకం కానున్నారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి మొదట నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి హోటల్ వంశీ లో ముఖ్య కార్యకర్తల తో సమావేశం కానున్నారు. పదేళ్ల తరవాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ లో సానుకూల ఫలితాలు సాధించడం ఆ పార్టీకి అనివార్యంగా మారింది. ఎంపీ ఎమ్మెల్యే లుండడంతో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది.
మేయర్ స్థానం కు సరిపడా కార్పొరేటర్లు గెలవడం అంత సులువేమి కాదు. అందుకే గట్టిగా పనిచేయడం మీద పీసీసీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సీనియర్ నేతగా ఉన్న ఉత్తమ్ కు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు అయన గాంధీ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు అనివార్యం అని స్పష్టం చేసారు ఎవరెవరు ఏ మున్సీపాల్టీ బాధ్యతలు చూడాలో స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో ఎలా పనిచేయాలో కూడా చెప్పారు.
రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఆయన కార్యక్షేత్రంలోకి దిగారు ఆదివారం నిజామాబాద్ జగిత్యాల్ జిల్లాలో సుడిగాలి పర్యటన కు సిద్ధం అయ్యారు. పార్టీ అధికారంలో ఉండడంతో కౌన్సిలర్, కార్పొరేటర్ టికెట్ల కోసం క్యాడర్ పోటాపోటీ ఉంది.ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి.
అర్బన్ లో దాదాపు 900 ఫై చిలుకు దరఖాస్తులు వచ్చాయంటే అభ్యర్థులను ఖరారు చెయ్యడం కూడా క్లిష్టంగా మారే ల ఉంది. కొందరు నేతలు టికెట్లు తాము ఇప్పిస్తామని ఆశావహుల నుంచి నయానో బయోనో బేరాలు చేస్తున్నారని బాహాటంగా ప్రచారం జరుగుతుంది. ఎలాంటి ప్రలోభాలకు అవకాశం వుండదని అలాంటి వారిని నమ్మొద్దని పార్టీ అర్బన్ అధ్యక్షుడు కోరారు.
టికెట్ లు ఎలా ఖరారు చేస్తారో ఉత్తమ్ ఆదివారం పార్టీ క్యాడర్ కు స్పష్టత ఇవ్వనున్నారు ఏ ప్రాతిపదికగా అభ్యర్థులను ఖరారు చెయ్యనున్నారనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ గా మారింది.
