Saturday, May 2, 2026
HomeTelanganaNizamabad‘పుర’ సమరానికి హస్తం సిద్ధం.. నిజామాబాద్ అభ్యర్థుల ఖరారు!

‘పుర’ సమరానికి హస్తం సిద్ధం.. నిజామాబాద్ అభ్యర్థుల ఖరారు!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ఎట్టకేలకు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా టికెట్ల కోసం గాంధీ భవన్ నుంచి నిజామాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం వరకు చక్కర్లు కొట్టిన ఆశావాహుల నిరీక్షణ ఫలించింది.

గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న వ్యూహంతో, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 60 డివిజన్లలో పోటీ చేసేందుకు వందలాది మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను సిద్ధం చేసింది.

పాత వారితో పాటు, ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన కీలక నేతలకు కూడా ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల వివరాలు..ఒకటవ డివిజన్ అగ్గు భోజన్న, రెండవ డివిజన్ గుండు అరుణ, 3వ డివిజన్ జక్కుల సంధ్య, నాలుగవ డివిజన్ అరుణ్ కుమార్ నిమ్మగడ్డ, ఐదవ డివిజన్ ఈగ రమేష్ రెడ్డి,ఆరవ డివిజన్ వేంపల్లి మమత,ఏడవ డివిజన్ రామ్మూర్తి గోపికృష్ణ, 8వ డివిజన్ జిల్లాల రమేష్, పదవ డివిజన్ మహమ్మద్ అన్వర్, 11 డివిజన్ పర్హిన్ బేగం, 12 వ డివిజన్ ధూమలి అరుంధతి,13 వ డివిజన్ ధర్మస్థ హరి చాంద్,14 వ డివిజన్ మహమ్మద్ అబ్దుల్ బరి,15 వ డివిజన్ తూటి కూర ప్రీతమ్,16 వ డివిజన్ పంచ రెడ్డి దివ్య, 17వ డివిజన్ శారద సంఘం, 18వ డివిజన్ క్యాతం హనుమాన్లు, 19వ డివిజన్ సమంత కట్పల్లి, 20 డివిజన్ వడ్డెపు లలిత, 22వ డివిజన్ పుప్పాల లక్ష్మి 23వ డివిజన్ కొత్త భాగ్యలక్ష్మి, 24వ డివిజన్ అంతిరెడ్డి గౌతమి, 25వ డివిజన్ అంత రెడ్డి శ్వేత, 26వ డివిజన్ శివప్రసాద్ సకినాల, 27వ డివిజన్ పెంటి లావణ్య, 28వ డివిజన్ మాతం రేవతి, 29వ డివిజన్ అనిస్ ఫాతిమా, 30 డివిజన్ మొహమ్మద్ సమియోద్దీన్ ,31 వ డివిజన్ గౌసియా బేగం, 32వ డివిజన్ నజరీన్ ఫాతిమా, 33 వ డివిజన్ సురాయ జబీన్, 34వ డివిజన్ వర్షా శారద, 35వ డివిజన్ కోవూరి జగన్నాథం, 36వ డివిజన్ జక్కుల శ్రీలత విక్కీ, 37వ డివిజన్ కరిపే గుండాజి లావణ్య, 38వ డివిజన్ వేల్పుల ప్రవీణ్ యాదవ్, 40 డివిజన్ సింగారం నరేందర్, 41 వ డివిజన్ బొంబోతుల పూజిత గౌడ్, 42వ డివిజన్ కేశ మహేష్, 44వ డివిజన్ దండు రాజేంద్రప్రసాద్, 45వ డివిజన్ కస్తూరి భవాని, 48 వ డివిజన్ యమగంటి నరేందర్ గౌడ్, 49వ డివిజన్ కూరగాయల ఉమారాణి, 50వ డివిజన్ ధర్మారం అవిన్, 51వ డివిజన్ బాసోల్ల నాగరాజు, 53వ డివిజన్ షహీన్ బేగం, 54వ డివిజన్ జవేరియా ఫాతిమా, 55వ డివిజన్ షాదబ్ అలీ ఖాన్, 56వ డివిజన్ రజియా బేగం, 57వ డివిజన్ హుమేర మెహనాస్ మజార్, 58 వ డివిజన్ అబూద్ బిన్ అబ్దుల్లా, 59 వ డివిజన్ రఫాత్ పర్వీన్, 60వ డివిజన్ అస్రా నాజ్నీన్.లకు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.అభ్యర్థులు ఖరారు కావడంతో ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో బి-ఫారాలను పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!