Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadఉపాధి పనులను ప్రారంభించిన సర్పంచ్ విజయ..

ఉపాధి పనులను ప్రారంభించిన సర్పంచ్ విజయ..

మండల పరిధిలోని భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా సోమవారం కాలువ పూడికతీత పనులను సర్పంచ్ దోమకొండ విజయ స్వామి ఘనంగా ప్రారంభించారు. ఆరేపల్లి రోడ్డు నుండి సంద చెరువు వరకు పేరుకుపోయిన పూడికను తొలగించే పనులకు ఆమె శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తుగా కాలువలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.

ఉపాధి కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆశన్నగారి మంజుల రమేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పర్వీన్ బేగం, వివిధ వార్డుల సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కాలువ పూడికతీత ద్వారా సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!