Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadరిటైర్డ్ ఉద్యోగులే ప్రభుత్వానికి పునాది: పిసిసి మహేష్ కుమార్ గౌడ్..

రిటైర్డ్ ఉద్యోగులే ప్రభుత్వానికి పునాది: పిసిసి మహేష్ కుమార్ గౌడ్..

రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థకు పునాది వంటి వారని, వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ సేవలో తరించిన వారికి విశ్రాంతి కాలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

రిటైడ్ ఉద్యోగుకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!