మున్సిపల్ ఎన్నికలపోలింగ్ బుధవారం మొదలయింది సంబంధించి ఉదయం 7.00 గంటల లకే పోలింగ్ సిబ్బంది . ఓటింగ్ కు సిద్ధంగా ఉన్నారు కానీ ఉదయం చలి ఎక్కువగా వుండడంతో వోటర్లు ఉదయం 9 దాక వోట్లు వెయ్యడానికి రాలేదు మొదటి రెండు గంటలు మందకొడిగా పోలింగ్ జరిగింది జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలకు .
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి 3,48,116 మంది ఓటర్లు ఉండగా, 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు . అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డుల పరిధిలో 69,439 మంది ఓటర్లు ఉండగా 111 పోలింగ్ కేంద్రాలను, ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో 36 వార్డులలో 63,977 ఓటర్లకు గాను 106 పోలింగ్ కేంద్రాలను, భీంగల్ మున్సిపాలిటి పరిధిలో 12 వార్డులలో 14,046 మంది ఓటర్లు ఉండగా, 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు .
నాలుగు మున్సిపాలిటీలలో కలుపుకుని మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, బోధన్ లో 162 మంది, ఆర్మూర్ లో 153 మంది, భీంగల్ లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
మొత్తం 4375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు 66మంది ఆర్.ఓలు, 66 మంది ఏ.ఆర్.ఓలు, 877 మంది పీ.ఓలు, 877మంది ఏ.పీ.ఓలు, 2625 మంది ఓ.పీ.ఓలు ఉన్నారని వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయించామని, ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా 73 మంది మైక్రో అబ్జర్వర్లను, 47మంది జోనల్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు.
కాగా, అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు బీ.ఎల్.ఓల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటరు సమాచార స్లిప్పులను అందజేయడం జరిగిందని, ఇప్పటికే 88 శాతం పంపిణీ పూర్తయ్యిందని, మిగతా వాటిని మంగళవారం సాయంత్రం వరకు పంపిణీ పూర్తి చేయిస్తామని అన్నారు.
18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని చూపి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. అయితే, పోలింగ్ కేంద్రాలలోకి సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ద్రవ పదార్థాలను పూర్తిగా నిషేధించడం జరిగిందని, ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తమ వెంట పోలింగ్ బూత్ లోనికి తీసుకెళ్లకూడదని అన్నారు.
ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి అనుమతించేలా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని తెలిపారు. 11న సాయంత్రం 5.00 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి చేరుకున్న ఓటర్లకు క్యూ పద్దతిని అనుసరిస్తూ టోకెన్లు జారీ చేసి ఓటింగ్ కు అవకాశం ఇస్తారు
, ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాలవద్ద గురు ఏ.సీ.పీలు, 70 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మరో 70 మంది సబ్ ఇన్స్పెక్టర్లు సహా 1370 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు , ప్రత్యేకంగా మూడు ప్లాటూన్ల పోలీసు బలగాలు జిల్లాకు వచ్చాయి . స్త్రైకింగ్ ఫోర్సు, క్విక్ రియాక్షన్ టీం బృందాలు ఏర్పాటు చేశామని, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలు సైతం అందుబాటులోకి తెచ్చారు
