Wednesday, April 29, 2026
HomeCRIMEబోధన్‌లో దొంగ ఓట్ల కలకలం: ఇద్దరి అరెస్ట్..

బోధన్‌లో దొంగ ఓట్ల కలకలం: ఇద్దరి అరెస్ట్..

రాకాసిపేట, గోశాల కేంద్రాల్లో తప్పుడు గుర్తింపు కార్డులతో ప్రత్యక్షం..బోధన్ పట్టణంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో దొంగ ఓట్ల కలకలం రేగింది. ఇతరుల పేర్లతో ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పట్టణంలోని రాకాసిపేట మరియు గోశాల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక రాకాసిపేటలోని బూత్ నంబర్ 24, అలాగే గోశాల ఏరియాలోని బూత్ నంబర్ 78లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి.

పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల గుర్తింపు కార్డులను అధికారులు తనిఖీ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి నడవడికపై అనుమానం వచ్చిన పోలింగ్ ఏజెంట్లు మరియు ఎన్నికల సిబ్బంది వెంటనే వారిని నిలదీశారు.

అధికారుల విచారణలో వారు అసలైన ఓటర్లు కాదని, ఇతరుల ఓట్లను వేయడానికి వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడిన నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా లేదా ఇతరుల ఓటు వేయడానికి ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!