నూతన కార్పొరేటర్‌కు ఘన సన్మానంభారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అలాగే నేడు బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు కూడా కావడంతో పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. *విజయలక్ష్మి దంపతులకు సన్మానం..
ఇదే వేదికపై నూతనంగా ఎన్నికైన 37వ డివిజన్ కార్పొరేటర్ ప్యాట విజయలక్ష్మి, డివిజన్ అధ్యక్షుడు ప్యాట సంతోష్‌లను బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సత్యప్రకాశ్, సుజిత్ సింగ్, దండు శేఖర్ , కార్యకర్తలు పాల్గొన్నారు.
