HomeTelanganaNizamabadనిజామాబాద్ మేయర్ దంపతులకు శివదీక్షా సేవా సమితి ఘన సన్మానం

నిజామాబాద్ మేయర్ దంపతులకు శివదీక్షా సేవా సమితి ఘన సన్మానం

నిజామాబాద్ నగర నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కూరగాయల ఉమారాణి వారి జీవిత భాగస్వామి శ్రీ కూరగాయల రమేష్ (కరాటే రమేష్ శివ గురు స్వామి) ని శివదీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు.

నగర అభివృద్ధిలో ఆధ్యాత్మిక సేవలో ఈ దంపతులు చూపుతున్న చొరవను కొనియాడుతూ, సమితి సభ్యులు వారిని శాలువాలతో కప్పి, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఉమారాణి నాయకత్వంలో నిజామాబాద్ నగరం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలోశివదీక్షా సేవా సమితి ప్రతినిధులు సదా శివ, గంజి రమేష్, సోమలింగం కిరణ్, మనోహర్, శ్రీకాంత్, కిషన్, తమలపాకులు గంగాధర్, శివ రతన్, రాకేష్, జశ్వంత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments