HomeCRIMEవర్ని లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అదృశ్యం

వర్ని లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అదృశ్యం

మండలంలోని సత్యనారాయణపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… సత్యనారాయణపురానికి చెందిన ఓ వివాహిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

అయితే, ఎంత సమయం గడిచినా వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ బంధువులు, తెలిసిన వారి ఇళ్లు మరియు సమీప ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా వారి ఆచూకీ లభించలేదు.

దీంతో ఆందోళన చెందిన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మిస్సింగ్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వర్ని పోలీసులు తెలిపారు. తల్లి, ఇద్దరు కుమార్ధెల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, వారిని గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments