ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాంపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది ప్రాణ నష్టమేమి జరగలేదు ఘటన లో తీవ్రంగా గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు
అదుపుతప్పి వాగులో పడిపోయిన బస్సు ఆసిఫాబాద్ డిపోది గా గుర్తించారు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలుకావడంతో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ వారిని 108 వాహనంలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటన స్థలానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
