HomeCRIMEజూబ్లీహిల్స్ లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ .......మరో రెండు ఇండ్లలో మిస్...

జూబ్లీహిల్స్ లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ …….మరో రెండు ఇండ్లలో మిస్…

జూబ్లీహిల్స్ ప. రోడ్డు నెంబర్ 10లో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త నీల్ కౌర్ నివాసంలో భారీ చోరీ జరిగింది.. ఆయన ఇంట్లో దుండగుడు చొరబడి భారీగా వజ్రా భరణాలతోపాటు బంగారు నగలు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొత్తం 10 తులాలకుపైగా బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. వాటిలో ఎమరాల్డ్ ఉంగరం, బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, చెవి కమ్మలు సహా ఇతర ఆభరణాలు ఉన్నాయని వివరించారు.పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దీంతో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. కౌర్ నివాసంలో ఎవరూ లేకపోవడంతో వెనుక భాగం నుంచి దుండగుడు ఇంట్లోకి చొరబడినట్లు సీసీటీవీల ద్వారా పోలీసులు గుర్తించారు.

కిటికీ గ్రిల్స్ తొలగించి.. ఇంట్లోకి ప్రవేశించినట్లు కనుగొన్నారు. అంతకుముందు మరో రెండు ఇళ్లలో చోరీ చేసేందుకు సదరు దుండగుడు ప్రయత్నించాడు. అయితే ఆ ఇంటి యజమానులు మెల్కోని ఉండడంతో అతడు వెనక్కి వచ్చినట్లు సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments