కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల పదవి కాలం పూర్తీ అవుతున్న నేపథ్యంలో మరోసారి నామినేటెడ్ పోస్టు ల భర్తీ కి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో నేతల్లో మరోసారి నామినేటెడ్ పోస్టు ల ఫై నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి.
మొదటి దఫా లో ఏ పోస్టు దక్కని నేతలు ఈసారి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ఈ దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీ లో ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో అనేక మంది నేతలు బిఆర్ యస్ బీజేపీ లను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
వీరు పార్టీలో చేరేటప్పుడే పదవుల భరోసా తీసుకున్నారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ జూనియర్ నినాదాలు తెరమీదికి వచ్చాయి ఏళ్ల తరబడిగాఅధికారంలేక పోయినా పార్టీ నే నమ్ముకొని పనిచేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని అధిష్ఠానము భరోసా ఇచ్చింది ఆ మేరకు మొదటి దఫా నామినేటెడ్ పోస్టు కేటాయింపులో కేవలం సీనియర్ నేతలకే ఛాన్స్ వచ్చింది జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇదే ఫార్ములా అమలు అయింది దీనితో సహజంగానే పార్టీలో కొత్తగా వచ్చిన నేతలు నిరాశ కు గురయ్యారు.
అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో సానుకూల పలితాలు రాకపోయినా ఉమ్మడి జిల్లాకు నామినేటేడ్ పోస్టులు వరద లా వచ్చాయి ముగ్గురు సలహాదారుల తో పాటు ఐదుగురికి కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు దక్కాయి అయితే వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు ఆశించి భంగపడ్డ నేతలే దాదాపు టికెట్ లకోసం చివరి దాక ప్రయత్నాలు చేసి విఫలం అయిన నేతలకు ఎదో ఒకేచోట సర్దు బాటు అయ్యారు
దీనితో మలిదఫా నామినేటెడ్ పోస్టు భర్తీ లో కొత్తగా చేరిన నేతలకు అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఎవరెవరికి హామీ ఇచ్చారనేది స్పష్టత మాత్రం రావడం లేదు. కానీ ఈసారి మరో రెండు కార్పొరేషన్ ఛైర్మెన్ పోస్టు జిల్లాకు దక్కబోతున్నాయంటూ ఆ పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతుంది.
