సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడింది. అమెరికా సైనిక స్థావరాలున్న అనేక దేశాలను లక్ష్యంగా చేసుకొని ఆదివారం ఇరాన్ పశ్చిమాసియాలో 27 చోట్ల దాడులు చేసింది.
దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై ఏక కాలంలో అటాక్స్ చేస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఎటాక్ చేసింది. ఈ ఘటనలో ఎయిర్ పోర్టు స్వల్పంగా ధ్వంసమైంది.
ఖమేనీ హత్య తర్వాత దుబాయ్‌లో అత్యంత ఎత్తైన బుర్జా ఖలీఫా టవర్‌పై మరోసారి దాడికి యత్నించింది. అలాగే, లెబనాన్‌లోని యూఎస్ ఎంబసీపై విరుచుకుపడింది.
