నగరంలో గుట్టుగా గంజాయినీ విక్రయిస్తున్న వ్యక్తినీ పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని ముస్తైద్పురాకు చెందిన షేక్ అబ్దుల్ ఖైజర్ తన నివాసంలో గంజాయిని నిల్వ ఉంచి, గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్హెచ్ఓ స్వప్న, ఎస్ఐ మల్లేష్ తన బృందంతో కలిసి మంగళవారం నిందితుడి నివాసంపై దాడి చేశారు.
పోలీసుల సోదాల్లో నిందితుడి వద్ద నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.ఈ దాడిలో ఎస్ఐ మల్లేష్, సునీల్, మోహన్ సింగ్, ధారీసింగ్, రవి, షబ్బీర్, సంజయ్, ప్రభాకర్, సుచరిత పాల్గొన్నారు.
