Thursday, April 30, 2026
HomeCRIMEఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య.

ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య.

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది.తొమ్మిదో తరగతి చదువుతున్న రామ్ చరణ్ (15) అనే విద్యార్థి పాఠశాల గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించే లోపే విద్యార్థి ప్రాణాలు విడిచాడు.వివరాల్లోకి వెళ్తే..మృతుడు రామ్ చరణ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదువుల ఒత్తిడా లేక వ్యక్తిగత కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!