Thursday, April 16, 2026
HomeDevotionalసేవాలాల్ మహారాజ్ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

సేవాలాల్ మహారాజ్ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతం, ఇందిరా ప్రియదర్శిని కాలనీ (IPD)లో నూతనంగా నిర్మించిన ఇందూర్ ఘడ్ శ్రీ భగదాంబ – సేవాలాల్ మహారాజ్ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతల ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.

సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందేందుకు దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జగదాంబ తల్లి మరియు సేవాలాల్ మహారాజ్ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య వైభవంగా నిర్వహించబడుతున్నాయి.

మూడు రోజుల పాటు యాగశాల కార్యక్రమాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడగా, చివరి రోజు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ఠ, పంచామృతాభిషేకం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి , రమేష్ , 42వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ శశాంక్ రెడ్డి ,19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మి నారాయణ , 39 వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి , ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ సందర్భంగా ప్రతిరోజు భక్తులకు అన్నదానం కూడా నిర్వహించబడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!