HomeTelanganaNizamabadమహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. POW. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. వి. గోదావరి...

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. POW. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. వి. గోదావరి డిమాండ్…

ప్రగతిశీల మహిళా సంఘం(POW )ఆధ్వర్యంలో శ్రామిక నగర్ గౌడ్స్ కాలనీ నెంబర్ వన్ ,నిజామాబాద్ లో శ్రామిక మహిళా దినోత్సవం తేదీ. 10 మార్చ్ 2026న జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి . శ్రీమతి.కే జయప్రద అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా పరిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. వి గోదావరి అక్క మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలుగా వస్తున్న మహిళలపై వివక్ష కొనసాగుతుందని స్త్రీని రెండవ శ్రేణి స్త్రీగానే నేడు సమాజంలో పాలకవర్గాలు చూస్తున్నాయి అని అన్నారు.

ఒక దిక్కు స్త్రీకి అన్ని హక్కులు కల్పిస్తున్నామని చెబుతూనే మరోపక్క స్త్రీలకు ఉపాధి కల్పించకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ సర్కార్ రద్దు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

అలాగే స్త్రీని ఒక దిక్కు దేవతని పొగుడుతూనే పూజిస్తూనే మరో దిక్కు వాళ్లపై లైంగిక వేధింపులు మరియు గృహ హింసలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు .మరియు మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించిన చట్టాలని పార్లమెంట్లో చేయడానికి పాలకవర్గ పార్టీలన్నీ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

మరియు వి సత్తెమ్మ . ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మన సమస్యలు పరిష్కారం కావాలంటే స్త్రీలమంతా ఐక్యంగా ఉండాలని తన సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో పద్మ ,లలిత ,శ్యామల ,యాదమ్మ బాలలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించ బహుమతులు పంచడం జరిగింది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments