HomeTelanganakamareddyకాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి పిలుపు...

కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ గులాబీ యువదళం కదం తొక్కింది.

ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రైతు భరోసా బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అలాగే యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మాజీ MLA గంప గోవర్ధన్ పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గం BRS పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యువజన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు భరోసా బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments