అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పిప్రి గ్రామం వైపు వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టాడనీ అన్నారు.
ఈ ప్రమాదం ధాటికి స్కూటీపై వెళ్తున్న శ్రీనివాస్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారనీ అన్నారు.స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
