జిల్లాలో మండుతున్న ఎండలతో పాటే ఇసుక అక్రమ రవాణా కు తెరలేసింది. అధికార పార్టీ ముసుగులో అక్రమ దందా యథేచ్ఛగా సాగించడానికి ఇసుక మాఫియా కదన రంగంలోకి దిగింది.
గత పదేళ్లుగా ఇసుక అక్రమ దందా అత్యంత అనువైన ఆర్మూర్ ప్రాంతం నుంచి నిజామాబాద్ నగరానికి ఇసుక గుట్టుగా తరలిస్తున్నారు. ఆర్మూర్ ఏరియా లో వాగుల్లో రాత్రంతా జేసీబీ లు టిప్పర్లతో ఇసుక జాతర సాగుతుంది.
గతంలో మాదిరే ఈసారి కూడా అధికార పార్టీకి చెందిన కీలక నేతలకనుసన్నల్లో ఇసుక దందా సాగుతుంది. అక్రమ దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ , మైనింగ్ శాఖ పోలీస్ శాఖ లు అచేతనంగా వ్యవహరిస్తున్నాయి. అధికార బలంగా ఉన్న సరే సంబంధింత అధికారులకు ఇవ్వాల్సిన ముడుపుల విషయంలో ఇసుక మాఫియా ఏ మాత్రం వెనక్కి తగ్గారు.
ఆయా ప్రభుత్వ పథకాల పేరుతొ వే బిల్లులు తీసుకుంటున్న వ్యాపారాలు ఆ మాటున ఈ దందా ను యథేచ్ఛగా సాగిస్తున్నారు . రాత్రంతా గస్తీ విధుల్లో రోడ్ల మీద చక్కర్లు కొట్టే పోలీసులకు ఇసుక వాహనాలు రోడెక్కగానే పసి గట్టేస్తున్నారు.
రయ్యున వెళ్లి పట్టేస్తున్నారు కూడా కానీ ఈ దందా లావెనుక అధికార పార్టీ నేతలుండడం తో కఠిన చర్యల దాక వెళ్లలేక పోతున్నారు . వాహనాల ను సీజ్ చేయకుండ జస్ట్ ఎదో మొక్కుబడి కేసు తో సరిపెట్టేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ‘99 రోజుల ప్రణాళిక’ (ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక) భాగంగా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఇసుక అక్రమ రవాణాపై అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఒక్క ఇసుక రేణువు కూడా అక్రమంగా తరలించడానికి వీల్లేదని, కేవలం ప్రభుత్వ యాప్ ద్వారానే పారదర్శకంగా రవాణా జరగాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే నేరుగా ఆ బాధ్యులను సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఈ స్థాయిలోనే గద్దించినా సరే , క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు అధికారులు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు.ఇసుక వ్యాపారుల పట్ల సానుకూలత తో వ్యవహరిస్తున్నారు.
జిల్లా కలెక్టర్, సీపీలు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్టు’ వ్యవహరిస్తూ వారి ఆదేశాలకే తూట్లు పొడుస్తున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే ‘చాప కింద నీరులా’ వారికి సహకరించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ అక్రమ దందా ను అడ్డుకోవాల్సింది పోలీసులే అనే ధోరణి రెవెన్యూ మైనింగ్ అధికారుల్లో మితి మీరు పోయింది. తాము ఇష్ట రీతిన పర్మిట్ లు ఇస్తూ వే బిల్లు జారీ చేస్తున్నా అవి ఎలా మిస్ యూజ్ చేస్తుంది సంబంధిత అధికారులు కనీస పర్యవేక్షించ లేక పోతున్నారు
